Sale!

Amalodbhavilo Arjunudu – A Telugu Novel

Original price was: ₹250.00.Current price is: ₹200.00.

ఒక రాజ్యం…
ఒక యుద్ధం…
ఒక నిర్ణయం…

చరిత్రలో మార్పు తెచ్చేది
ఒక వ్యక్తి కాదు —
ఒక ఆలోచన.

అధికారం కోసం పోరాడేవాళ్ళ మధ్య,
ధర్మం కోసం నిలబడేవాడు ఎవరు?

అతడే అర్జునుడు.

“అమలోద్భవిలో అర్జునుడు”
మీను ఒక పురాతన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది —
కాని మీలోనే ఒక కొత్త ప్రశ్నను మిగులుస్తుంది.

👉 మీరు ఎవరి పక్షం?
అధికారం?
లేక ధర్మం?

📌 ఈ పుస్తకం ఎందుకు చదవాలి? (Why You Should Read)

1️⃣ కేవలం కథ కాదు — ఒక ఆలోచన

ఈ నవల ఒక హీరో కథ కాదు.
ఇది ప్రతి మనిషిలో ఉన్న “అర్జునుడు” గురించి.


2️⃣ భారీ విజువల్ అనుభవం

చదివితే ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది —
యుద్ధాలు, రాజ్యాలు, రాజకీయాలు అన్ని లైవ్‌గా కనిపిస్తాయి.


3️⃣ ధర్మం vs అధికార పోరాటం

ఇది కేవలం యుద్ధం కాదు —
ఇది నైతికత, నమ్మకం, నిర్ణయాల మధ్య జరిగే యుద్ధం.


4️⃣ స్ట్రాంగ్ క్యారెక్టర్స్

ప్రతి పాత్ర గ్రే షేడ్‌లో ఉంటుంది —
ఎవరు పూర్తిగా మంచివారు కాదు, ఎవరు పూర్తిగా చెడ్డవారు కాదు.


5️⃣ డీప్ ఎమోషనల్ కనెక్ట్

యుద్ధం కంటే ఎక్కువగా —
మనుషుల మనసుల కథ ఇది.

Description

“అమలోద్భవిలో అర్జునుడు” ఒక చారిత్రక-భావనాత్మక గాథ.
15వ శతాబ్దపు భారతదేశాన్ని నేపథ్యంగా తీసుకుని, రాజ్యాలు, యుద్ధాలు, రాజకీయ కుట్రలు, మానవ విలువలు అన్నీ కలిసిన ఒక విస్తారమైన ప్రపంచాన్ని ఈ నవల నిర్మిస్తుంది.

విజయవర్మ, అరివింద వర్మ వంటి శక్తివంతమైన రాజులు,
అధికార పోరాటాలు, విశ్వాసం, ద్రోహం, ధర్మం —
ఈ కథలో ప్రతి అంశం ఒక యుద్ధంలా ముందుకొస్తుంది.

కానీ ఈ కథలో ప్రధాన ప్రశ్న ఒక్కటే —
“అర్జునుడు ఎవరు?”

అతను ఒక వ్యక్తినా?
లేక ఒక భావనా?
లేక ప్రతి మనిషిలో ఉండే ధైర్యమా?

చీకటిలోనూ ధర్మం కోసం నిలబడే వ్యక్తి,
నిజం కోసం యుద్ధం చేసే మనసు —
అదే “అర్జునుడు”.

ఈ నవలలో యుద్ధాలు కేవలం ఖడ్గాల మధ్య కాదు…
మనుషుల మనసుల మధ్య జరుగుతాయి.

1 review for Amalodbhavilo Arjunudu – A Telugu Novel

  1. Vijay

    అమలోద్భవిలో అర్జునుడు — పుస్తక సమీక్ష

    “అమలోద్భవిలో అర్జునుడు” అనే నవల పేరు చదవగానే మనసులో అనేక సందేహాలు మొలకెత్తాయి. పాండవ మధ్యముడు, కిరీటి అయిన అర్జునుడికి ఈ నవలకు ఉన్న సంబంధం ఏమిటి? ఇందలి అర్జునుడు పాండవ అర్జునుడేనా, వేరే వ్యక్తా? అసలు అమలోద్భవి అంటే ఏమిటి? ఇటువంటి కుతూహలంతో రచయిత ఎవరా అని చూస్తే — విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న యువకుడు “విజయ్ అప్పల్ల.” నేటి యువత సామాజిక మాధ్యమాల వెంట పరుగులు తీస్తుంటే, ఒక NRI యువకుడు జానపద నవల రాయడం నిజంగా ఆనందం కలిగించే విషయం. “కష్టాలను తట్టుకుని నిలబడిన నా మనోధైర్యానికి ఈ నవల అంకితం” అని రాసిన అంకితవాక్యం రచయిత ఆత్మవిశ్వాసానికి అద్దం పడుతుంది.
    తనికెళ్ళ భరణి, వి.యెన్.ఆదిత్య, ఆరుద్ర ఈశ్వర్ వంటి ప్రముఖుల ముందుమాటలు నవలపై మరింత ఆసక్తిని పెంచాయి. ఇది విజయ్ అప్పల్ల రాసిన నాలుగవ నవల. చిన్న కథలతో కాకుండా, భారీ కాన్వాస్ నవలలతోనే సాహితీ ప్రయాణం మొదలుపెట్టిన ఈ యువరచయిత విజయవంతంగా తన రచనా పయనాన్ని కొనసాగిస్తున్నారు.
    నవల నేపథ్యం పదిహేనవ శతాబ్దం నాటిది. విజయనగర సామ్రాజ్యంతో సన్నిహిత సంబంధాలు కలిగి, తొంభై తొమ్మిది ఏళ్ళు స్వతంత్రంగా పరిపాలించే అనుమతి పొందిన కులశేఖర రాజ్యం నవలా వేదిక. రాజు విజయవర్మకు ఇద్దరు కుమారులు — పరాక్రమవర్మ, విక్రమవర్మ. ఒక శాపం కారణంగా పెద్దకుమారుడు పరాక్రమవర్మ మానసికంగా ఎదగలేక రాజ్యాధికారానికి అనర్హుడవుతాడు. అన్ని విద్యల్లో ఆరితేరిన విక్రమవర్మ రాజుగా పట్టాభిషేకం పొందుతాడు. రాజ్యాధికారం చేపట్టే ముందు విక్రమవర్మ రెండు పున్నముల కాలం యాత్రకు బయలుదేరుతాడు — ఆ యాత్రలో అతను ఎక్కడికి వెళతాడు, ఎవరిని కలుసుకుంటాడు, అమలోద్భవి ఎక్కడ ఉంది, అర్జునుడు ఎవరు అనే రహస్యాలే ఈ నవల గుండెచప్పుడు.
    విక్రమవర్మ రాజ్యపాలన, శత్రురాజ్యాల నుండి ప్రజలకు రక్షణ కల్పించిన తీరు, వదినగారైన రాధాసఖి వల్ల ఎదుర్కొన్న సంక్లిష్ట పరిస్థితులు పాఠకులను కులశేఖర రాజ్యంలో తిప్పినట్లే అనిపిస్తాయి. కులశేఖర రాజ్యంలోని గుప్తనిధిని దక్కించుకోవడానికి ఆఫ్రికా రాణి పన్నిన పథకాలు, విక్రమవర్మతో ఆమె చేసిన యుద్ధం, శివుని అంశతో కూడిన రుద్రకవచాన్ని సాధించిన తీరు — ఇవన్నీ ఉత్కంఠభరితంగా సాగుతాయి. నవల తొలి అంకంలో సృష్టించిన ముడులను చివరి అంకంలో నేర్పుగా విప్పే శైలి రచయిత పక్వతకు నిదర్శనం.
    కొన్ని చోట్ల ఇంకాస్త లోతు ఉంటే మరింత బావుండేది అనిపించింది. విక్రమవర్మ — చందులత దాంపత్య సన్నివేశాల్లో అనురాగం, రసజ్ఞత మరికొంచెం జోడించి ఉంటే బాగుండేది. పన్నెండేళ్ళ తర్వాత చనిపోయాడనుకున్న తన కన్నబిడ్డను కళ్ళారా చూసిన చందులత ఆనందోద్వేగాన్ని మరింత హృద్యంగా చిత్రించి ఉంటే ఆ సన్నివేశం మరింత పరిపుష్టమయ్యేది.
    అయినా నవల ముగింపులో రచయిత అందించిన సందేశం మాత్రం మనసును తాకుతుంది — “కర్మలు ఎవరిని వదలవు. అయితే ధర్మం తప్పక సత్కర్మలు చేసేవారు ఎవరైనా అమలోద్భవిలో అర్జునులే.” నవల పక్కన పెట్టినా పాత్రలు మన మనసులో సజీవంగా తిరుగాడుతూనే ఉంటాయి. ధర్మనిరతి కలవారందరూ అమలోద్భవి వాసులే అని నిరూపించే ఈ నవలను తప్పకుండా చదవండి.
    సమీక్షకులు: రోహిణి వంజారి | 9000594630

Add a review

Your email address will not be published. Required fields are marked *